Tag: Voiceofnagarkurnool

సిద్ధాపూర్ పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ..

వార్షిక తనిఖీలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అచ్చంపేట సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్, సిద్ధాపూర్ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, ఫిర్యాదులపై వేగంగా స్పందించి బాధితులకు సత్వర న్యాయం…

రెయిన్‌బో ప్రీ ప్రైమరీ స్కూల్‌లో ఘనంగా గ్రీన్ డే వేడుకలు

# నాగర్‌కర్నూల్‌లోని రెయిన్‌బో ప్రీ ప్రైమరీ స్కూల్‌లో గ్రీన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆకుపచ్చ దుస్తులు ధరించి పాల్గొనగా, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు

సాయన్న ఆశయ సాధనకు ఐక్యంగా నిలబడాలి…

# పండుగ సాయన్న పేదల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరుడని అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. లింగాలలో సాయన్న విగ్రహ ఏర్పాటుకు నిర్వహించిన భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఆయన ఆశయ సాధనకు అందరూ ఐక్యంగా నిలబడాలని…

పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం

వ్యవసాయంతో పాటు పశుపోషణను అనుబంధ రంగంగా అభివృద్ధి చేసుకోవడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. మరికల్ గ్రామంలో రైతు పొలాన్ని సందర్శించిన కలెక్టర్ పశువుల పెంపకం, పాల ఉత్పత్తి, ఆదాయంపై…

తెలకపల్లి మండల దివ్యాంగుల పరిరక్షణ కమిటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

తెలకపల్లి మండల దివ్యాంగుల పరిరక్షణ కమిటీ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బోడ వెంకటయ్య అధ్యక్షులుగా, నాగనూలు శివరాం ప్రధాన కార్యదర్శిగా, గువ్వల సుదర్శన్ కోశాధికారిగా ఎన్నికయ్యారు.

జటప్రోలులో యంగ్ ఇండియా స్కూల్ పనుల పరిశీలన..

జటప్రోలులో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు నాణ్యత విషయంలో రాజీపడొద్దని అధికారులను ఆదేశించారు.

పెద్దచింతరేవుల ఆంజనేయ స్వామికి ఉడిపి, పాలిమార్ పీఠాధిపతుల ప్రత్యేక పూజలు

పెద్దచింతరేవుల ఆంజనేయ స్వామి ఆలయంలో ఉడిపి, పాలిమార్ పీఠాధిపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 55 రోజుల పాటు భక్తులకు అన్నప్రసాదం, అల్పాహారం అందించనున్నారు.

శ్రీ శనేశ్వర స్వామికి భక్తిశ్రద్ధలతో తిలతైల అభిషేకాలు

బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్‌లోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో శని గ్రహ దోష నివారణ కోసం భక్తిశ్రద్ధలతో తిలతైల అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి:

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా నాగర్‌కర్నూల్ ఐడీఓసీలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. జయశంకర్ ఆశయాల సాధనకు అధికారులు, యువత, ప్రతి పౌరుడు బాధ్యతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.

చెంచు గిరిజనులకు ఆధార్ నమోదు వేగవంతం చేయాలి..

నాగర్‌కర్నూల్ జిల్లాలోని చెంచు గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ఆధార్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15లోగా నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి, నెలాఖరులోగా…