మహాలక్ష్మి దేవి అలంకరణలో అమ్మవారిని భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి పూజించడం ద్వారా కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం కలగాలని భక్తులు ఆకాంక్షించారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మహిళలు, యువత, కాలనీవాసులు ఉత్సాహంగా పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేశారు. అమ్మవారి సన్నిధిలో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేసి తమ కుటుంబాలకు అమ్మవారి ఆశీస్సులు లభించాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మంగమ్మ, హైమావతి, చంద్రకళ, వెంకటమ్మ, రత్నకుమారి, అరుణ, సరోజ, యామిని, కృష్ణవేణి, గాయత్రి, ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి తదితర మహిళలు పాల్గొన్నారు.
శరన్నవరాత్రి సందర్భంగా రాఘవేంద్ర కాలనీలో నిర్వహిస్తున్న దుర్గాపూజా కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. భక్తులంతా ఐక్యంగా పాల్గొంటూ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.: రాఘవేంద్ర కాలనీలో ఘనంగా దుర్గాదేవి మహాలక్ష్మి పూజలు



