Author: voiceofnagarkurnool@gmail.com

యూత్ డిక్లరేషన్ హామీలు వెంటనే అమలు చేయాలి…

యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో BJYM ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, ఫీజు బకాయిల చెల్లింపుతో పాటు విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నాయకులు డిమాండ్…

రాఘవేంద్ర కాలనీలో ఘనంగా దుర్గాదేవి మహాలక్ష్మి పూజలు

నాగర్‌కర్నూల్ రాఘవేంద్ర కాలనీలో శరన్నవరాత్రి దుర్గాపూజలో భాగంగా అమ్మవారిని మహాలక్ష్మి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివశక్తి యూత్, మహాగౌరీ మహిళా సంఘం ఆధ్వర్యంలో కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

కొల్లాపూర్ వాసవి దేవాలయంలో వైభవంగా లలిత త్రిపుర సుందరి అలంకరణ

కొల్లాపూర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు లలిత త్రిపుర సుందరి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. లలితా సహస్రనామాన్ని చేతితో కుట్టిన పట్టు చీరను దంపతులు అమ్మవారికి సమర్పించారు.

నాగర్‌కర్నూల్‌లో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు…

నాగర్‌కర్నూల్ సమీపంలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఈ నెల 11 నుంచి 20 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, కుంకుమార్చనతో పాటు భక్తులకు అన్నప్రసాద పంపిణీ ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఉమెన్ ఎంపవర్‌మెంట్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణలో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు.

శ్రీపురం అంగన్‌వాడీ కేంద్రంలో ‘తొలిముద్దు’ కార్యక్రమం ప్రారంభం

నాగర్‌కర్నూల్ మండలం శ్రీపురం గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో ‘తొలిముద్దు’ అల్పాహార పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మూడు నుంచి ఆరు సంవత్సరాల చిన్నారులకు కిచిడి, ఉప్మా వంటి అల్పాహారాన్ని అందించనున్నారు.

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైద్యులు, నర్సింగ్ అధికారులు, ఆరోగ్య సిబ్బంది గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

డిపిఆర్ఓ తీరు మారకపోతే ఖబర్దార్..!

నాగర్‌కర్నూల్ డిపిఆర్ఓ కార్యాలయంపై టీయూడబ్ల్యూజే (ఐజేయు) నాయకులు ఆరోపణలు చేశారు. అర్హత కలిగిన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అందించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.

ప్రభుత్వ కళాశాల నుంచి అంతర్జాతీయ సాంకేతికత వైపు..

అన్న-అక్క మెంటార్షిప్’లో భాగంగా నాగర్‌కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాఠశాలల్లో AI, కోడింగ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ టూల్స్‌పై శిక్షణ అందిస్తున్నారు.

లక్కీ డ్రాలో లడ్డూ కైవసం చేసుకున్న హకీమ్ విహాస్..

నాగర్‌కర్నూల్ సాయిబాబా ఆలయం సమీపంలో హనుమాన్ బృందం ఆధ్వర్యంలో 11 రోజుల పాటు నిర్వహించిన గణేశ్ ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో 14వ వార్డుకు చెందిన హకీమ్ విహాస్ లడ్డూను కైవసం చేసుకున్నారు.