తిమ్మాజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..
తిమ్మాజిపేట రైతు వేదికలో స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు కార్డులు, చెక్కులు అందజేశారు.
తిమ్మాజిపేట రైతు వేదికలో స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు కార్డులు, చెక్కులు అందజేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ 8 ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలను చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
సంచార, విముక్త జాతుల అభ్యున్నతికి ప్రత్యేక దృష్టి సారించాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సిద్దాపూర్ ఎస్సైగా విధులు నిర్వహించిన అంజయ్య 38 ఏళ్ల పోలీస్ సేవల అనంతరం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ఆయనను ఘనంగా సన్మానించారు.
పెద్ద చింతరేవులలో ఉడిపి పీఠాధిపతుల ఆధ్వర్యంలో రాఘవేంద్ర స్వామి ఆరాధన పూజలు వైభవంగా నిర్వహించారు. మూలమూర్తులకు శతహారతులు సమర్పించి, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీఆర్ఎస్ యువనేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగుల పోరాటాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, రైతులతో కలిసి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
కులగణనలో ఓపెన్ కాలమ్‌ను తొలగించి బీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి డిమాండ్ చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో BJYM ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సానుకూలంగా స్పందించారు. అర్హులైన జర్నలిస్టులకు నెల రోజుల్లో అక్రిడేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు.
తిమ్మాజిపేట ఎస్ఐపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఆరోపణలు అవాస్తవమని నాగర్ కర్నూలు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆరోపణలకు ఎలాంటి మెడికల్ ఆధారాలు లేవని అధికారులు తెలిపారు.