బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, BJYM రాష్ట్ర అధ్యక్షుడు గుండె గణేష్ పిలుపు మేరకు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నాయకులు తెలిపారు.
కల్వకుర్తి పట్టణంలో జరిగిన నిరసనకు BJYM నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ధన్నోజు నరేష్ చారి ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు అందాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధుల విడుదలలో జాప్యం కారణంగా విద్యార్థులు, వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మండల రూరల్ BJYM అధ్యక్షుడు శివ సేన, SC మోర్చా జిల్లా నాయకుడు పానుగంటి శివ, BJYM జిల్లా నాయకులు లస్కర్ శివాజీ, బల్మూరి ప్రశాంత్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి అరవింద్, చింటూ, అరవింద్ రెడ్డి, ఆనంద్, నవీన్, జగదీష్, లక్ష్మీనరసింహ తదితరులు పాల్గొన్నారు.: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలంటూ..


