Tag: Kalwakurthy

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలంటూ..

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో BJYM ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

బెక్కేరలో రీ-సర్వే పనుల పరిశీలన..

కల్వకుర్తి మండలం బెక్కేర గ్రామంలో పైలెట్ ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న రీ-సర్వే పనులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. చెన్నయ్య పరిశీలించారు. రీ-సర్వేపై ప్రజల అపోహలను తొలగించి, భూ యజమానులకు పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

కల్వకుర్తిలో BJYM ఫీజుల బకాయి–BJP లడాయి ఉద్యమం

కల్వకుర్తిలో BJYM ఆధ్వర్యంలో నిర్వహించిన "ఫీజుల బకాయి – BJP లడాయి" కార్యక్రమంలో విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వెల్దండలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ విస్తృత పర్యటన..

నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ విస్తృతంగా పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించడంతో పాటు బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

తర్మికల్ గ్రామంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమానికి శ్రీకారం

తర్మికల్ గ్రామంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ప్రారంభించి, జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ పిలుపునిచ్చారు.

నాగర్‌కర్నూల్‌లో తాగునీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి

నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రజలకు అందించే త్రాగునీరు పూర్తిగా శుద్ధితో సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. రానున్న వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ

నాగర్‌కర్నూల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, సీసీ కెమెరాలు, మూడంచెల భద్రతతో పారదర్శకంగా లెక్కింపు నిర్వహించనున్నట్లు…