డిగ్రీ అడ్మిషన్లకు చివరి అవకాశం..

2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ అడ్మిషన్ల కోసం DOST స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు జూలై 20 నుంచి 26 వరకు జరుగనున్నాయి. స్పెషల్ ఫేజ్ అనంతరం అడ్మిషన్లు ఉండవని నాగర్‌కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి తెలిపారు.

పాలమూరు ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి భేటీ

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సమావేశమై శ్రీశైలం బ్యాక్‌వాటర్–డిండి ప్రతిపాదనతో పాటు ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు.

ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులతో విద్యార్థుల భద్రతకు ముప్పు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు, అధిక ఫీజులు, విద్యార్థుల భద్రత, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వంటి విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి డిమాండ్ చేశారు.

బ్రోంకోస్కోపీతో తొలగించి 17 ఏళ్ల బాలుడికి ప్రాణదానం

పదేపదే న్యుమోనియా, దగ్గుతో బాధపడుతున్న 17 ఏళ్ల బాలుడి శ్వాసనాళంలో నాలుగేళ్లుగా చిక్కుకున్న ఆట వస్తువు ‘ఈల’ను మలక్‌పేట్ యశోదా ఆసుపత్రి వైద్యులు అధునాతన బ్రోంకోస్కోపీ ద్వారా విజయవంతంగా తొలగించారు. ఓపెన్ సర్జరీ లేకుండానే చికిత్స నిర్వహించడంతో బాలుడు వేగంగా కోలుకున్నాడు.

నాగర్‌కర్నూల్ ప్రజావాణికి 71 ఫిర్యాదులు..

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 71 ఫిర్యాదులు అందాయి. పెండింగ్ వినతులను త్వరగా పరిష్కరించడంతో పాటు ప్రతి సోమవారం సంక్షేమ హాస్టళ్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి సమస్యలపై నివేదికలు సమర్పించాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు.

నాగర్‌కర్నూల్‌లో అరుదైన శస్త్రచికిత్స…

నాగర్‌కర్నూల్‌లో ఐదు నెలల గర్భిణికి అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి అండాశయంలో ఉన్న సుమారు మూడు కిలోల కణితిని వైద్యులు తొలగించారు. శస్త్రచికిత్స అనంతరం గర్భం సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

జిల్లా విద్యాధికారిని సస్పెండ్ చేయాలి…

నాగర్‌కర్నూల్ జిల్లాలో విద్యాశాఖ పనితీరుపై పలు ఆరోపణలు చేస్తూ AISF, MSF, BSF, UISF, బీసీ విద్యార్థి సంఘాల నాయకులు డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి జిల్లా విద్యాధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం…

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఈదమ్మ గుడి సమీపంలోని సెవెంత్ సెంటర్‌లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ సుగుణ ఆధ్వర్యంలో చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు అందించి, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు.

40 ఏళ్ల సేవా ప్రస్థానంలో నూతన మైలురాయి…

నాలుగు దశాబ్దాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న నాగర్ కర్నూల్ జనరల్ మర్చంట్ అసోసియేషన్ నూతన మైలురాయిని చేరుకుంది.

పోక్సో కేసులో బెయిల్‌పై విడుదలైన నిందితుడి దారుణం…

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో పోక్సో కేసులో బెయిల్‌పై వచ్చిన నిందితుడు, తనపై కేసు పెట్టిన కుటుంబంపై ప్రతీకారంతో ఆరుగురిని హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.