నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ ప్రవేశాల కోసం DOST స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు జూలై 20 నుంచి జూలై 26, 2026 వరకు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి తెలిపారు.

ఇప్పటివరకు డిగ్రీలో ప్రవేశం పొందని విద్యార్థులకు ఇదే చివరి అవకాశం అని ఆమె స్పష్టం చేశారు. స్పెషల్ ఫేజ్ ముగిసిన తర్వాత ఎలాంటి అడ్మిషన్లు ఉండవని పేర్కొన్నారు. అందువల్ల అర్హులైన విద్యార్థులందరూ ఆలస్యం చేయకుండా DOST అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు.

ప్రస్తుతం కళాశాలలో బీఏ, బీకాం (కంప్యూటర్స్) తదితర కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అనుభవజ్ఞులైన అధ్యాపకులు, డిజిటల్ లైబ్రరీ, స్కాలర్‌షిప్‌లు, క్రీడా సౌకర్యాలు వంటి అన్ని వసతులు కళాశాలలో ఉన్నాయని వివరించారు.

అడ్మిషన్లకు సంబంధించిన సందేహాలు ఉంటే నేరుగా ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాల కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే విద్యార్థులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి కోరారు.: డిగ్రీ అడ్మిషన్లకు చివరి అవకాశం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *