Tag: నాగర్‌కర్నూల్

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఉద్యమం విజయమే..

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఉద్యమం ఫలితమేనని, ప్రజాగ్రహం ముందు ఎవరైనా తలవంచాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, విద్యార్థుల ఆందోళనలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన తీవ్ర విమర్శలు…

తొలి ఏకాదశి సందర్భంగా శ్రీశనేశ్వర స్వామికి తిలతైల అభిషేకాలు..

తొలి ఏకాదశి, శనివారం సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీశనేశ్వర స్వామి ఆలయంలో తిలతైల అభిషేకాలు, ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

రోడ్డు ప్రమాద బాధితుడికి అండగా నిలిచిన మంత్రి జూపల్లి కృష్ణారావు..

కొల్లాపూర్ మండలం సింగోటం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా తన వాహనంలో ఆస్పత్రికి తరలించి సకాలంలో వైద్యసాయం అందించారు. మంత్రి మానవత్వాన్ని స్థానికులు ప్రశంసించారు.

యూనిఫాంల పంపిణీలో నాగర్‌కర్నూల్‌కు రాష్ట్ర స్థాయి ప్రశంసలు..

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీలో నాగర్‌కర్నూల్ జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉందని సీఎస్ సంజయ్ జాజు ప్రశంసించారు. ఆగస్టు 25లోగా రెండు జతల యూనిఫాంల పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఎల్‌నినో ప్రభావంతో అప్రమత్తం..

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు.

పెద్దముద్దునూరులో నూతన ఎంపీపీఎస్ పాఠశాల ప్రారంభం..

నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దముద్దునూరులో నూతన ఎంపీపీఎస్ పాఠశాలను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, త్రిదండి చిన్న జీయర్ స్వామితో కలిసి ప్రారంభించారు. విద్యా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.

నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ కార్యాలయంలో BLAల సమావేశం..

నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన అన్ని వార్డుల BLAల సమావేశానికి ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి హాజరై పార్టీ బలోపేతం, ఓటరు జాబితా సవరణ, బూత్ స్థాయి సంస్థాగత నిర్మాణంపై కీలక సూచనలు చేశారు.

ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లురవి భరోసా.

నాగర్‌కర్నూల్‌లో సంచలనం సృష్టించిన ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ ఆర్థిక మోసం బాధితులకు న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ డా. మల్లురవి హామీ ఇచ్చినట్లు బాధితుల సంఘం ప్రతినిధులు వెల్లడించారు. జప్తు చేసిన ఆస్తులను బహిరంగ వేలం వేసి…

డిగ్రీ అడ్మిషన్లకు చివరి అవకాశం..

2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ అడ్మిషన్ల కోసం DOST స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు జూలై 20 నుంచి 26 వరకు జరుగనున్నాయి. స్పెషల్ ఫేజ్ అనంతరం అడ్మిషన్లు ఉండవని నాగర్‌కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి తెలిపారు.

జిల్లా విద్యాధికారిని సస్పెండ్ చేయాలి…

నాగర్‌కర్నూల్ జిల్లాలో విద్యాశాఖ పనితీరుపై పలు ఆరోపణలు చేస్తూ AISF, MSF, BSF, UISF, బీసీ విద్యార్థి సంఘాల నాయకులు డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి జిల్లా విద్యాధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.