నాగర్‌కర్నూల్ జిల్లాలోని పెద్దముద్దునూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎంపీపీఎస్ (మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల) భవనాన్ని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, త్రిదండి చిన్న జీయర్ స్వామితో కలిసి ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.

పాఠశాల ప్రారంభం అనంతరం త్రిదండి చిన్న జీయర్ స్వామి విద్యార్థులకు ఆశీర్వచనాలు అందించి, విద్యతో పాటు విలువలను అలవరచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

విద్యా రంగంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ఆధునిక సౌకర్యాలతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్, కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నూతన పాఠశాల ప్రారంభంతో గ్రామ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం అందుబాటులోకి వస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.: పెద్దముద్దునూరులో నూతన ఎంపీపీఎస్ పాఠశాల ప్రారంభం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *