Tag: Rajesh Reddy MLA

పెద్దముద్దునూరులో నూతన ఎంపీపీఎస్ పాఠశాల ప్రారంభం..

నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దముద్దునూరులో నూతన ఎంపీపీఎస్ పాఠశాలను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, త్రిదండి చిన్న జీయర్ స్వామితో కలిసి ప్రారంభించారు. విద్యా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.

నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ కార్యాలయంలో BLAల సమావేశం..

నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన అన్ని వార్డుల BLAల సమావేశానికి ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి హాజరై పార్టీ బలోపేతం, ఓటరు జాబితా సవరణ, బూత్ స్థాయి సంస్థాగత నిర్మాణంపై కీలక సూచనలు చేశారు.

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతులకు స్ప్రింక్లర్ పైపుల పంపిణీ

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాడూర్ మండలానికి చెందిన రైతులకు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి స్ప్రింక్లర్ పైపులను పంపిణీ చేశారు. నీటి పొదుపుతో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు.

సేవా కార్యక్రమాలతో జన్మదిన వేడుకలు…

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తన జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం నిర్వహించడంతో పాటు, శ్రీ జ్ఞానేశ్వర వాత్సుల్య మందిర్‌లోని చిన్నారులకు నూతన దుస్తులను పంపిణీ చేశారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు RTF చెక్కులు

నాగర్ కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద విడుదలైన RTF చెక్కులను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.