నాగర్‌కర్నూల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అన్ని వార్డుల బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ బలోపేతం, బూత్ స్థాయి సంస్థాగత నిర్మాణంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి బూత్‌లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని అన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో BLAలు అప్రమత్తంగా వ్యవహరించి అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదు అయ్యేలా కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని కోరారు.

పార్టీ విజయంలో బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్న ఎమ్మెల్యే, సమిష్టి కృషితో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలతో నిరంతరం మమేకమై పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా వివరించాలని సూచించారు.

సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, BLAలు, కార్యకర్తలు పాల్గొని పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ కార్యాలయంలో BLAల సమావేశం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *