నాగర్‌కర్నూల్ పట్టణంలోని 16వ వార్డు ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సందర్శించి పాఠశాల మౌలిక వసతులు, విద్యార్థుల విద్యాభ్యాసం, కంప్యూటర్ ల్యాబ్ నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి చదువుకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.

పరిశీలన సందర్భంగా కంప్యూటర్ ల్యాబ్‌కు కంప్యూటర్ ఉపాధ్యాయుడు లేకపోవడాన్ని గమనించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే ఉపాధ్యాయుడిని నియమించాలని ఆదేశించారు. డిజిటల్ విద్య నేటి కాలంలో అత్యంత అవసరమని, విద్యార్థులకు కంప్యూటర్ విద్యలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థుల చదువుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, విద్యా వనరులు కల్పించేందుకు కృషి చేస్తామని, ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి అవసరమైన అంశాలపై ఉపాధ్యాయులతో చర్చించి, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.: 16వ వార్డు ప్రభుత్వ పాఠశాల సందర్శించిన ఎమ్మెల్యే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *