ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు సకాలంలో విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థుల చదువుపై ఈ పరిస్థితి ప్రతికూల ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకుండా వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పూర్తిగా చెల్లించాలని, పెండింగ్ స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు కోరారు. విద్యార్థుల విద్యకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఈ నిరసనలో ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి
