ఈ సందర్భంగా వాసవి క్లబ్ సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న సిల్వర్ స్టార్ KCGF దాతలు హకీమ్ రాజేష్, మిడిదొడ్డి రాధాకృష్ణ, కొట్ర బాలాజీ, బాదం శివకుమార్లను ఘనంగా సన్మానించారు. సమాజ సేవలో భాగంగా వాసవి క్లబ్ చేపడుతున్న కార్యక్రమాలకు దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు శంభు శ్రీనివాసులు, జోన్ చైర్మన్ అర్థం సాయికృష్ణ, పూర్వ అధ్యక్షుడు కందూరు లక్ష్మణస్వామి, సెక్రటరీ శంభు పాండు, కోశాధికారి ఆకుతోట నాగరాజు పాల్గొన్నారు.
అలాగే వాస శ్రీనివాస్, పోల శ్రీనివాస్, గంధం ఉజ్వల్ కుమార్, పోలిశెట్టి మల్లేష్ తదితర వాసవి క్లబ్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వాసవి క్లబ్ ఫౌండర్ కల్వకుంట్ల చంద్రసేన గుప్త సేవలను ఈ సందర్భంగా సభ్యులు స్మరించుకున్నారు.: నాగర్‌కర్నూల్‌లో కల్వకుంట్ల చంద్రసేన గుప్త జయంతి వేడుకలు


