నాగర్‌కర్నూల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువత, విద్యార్థులు, మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా (BJYM) ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. BJYM జిల్లా అధ్యక్షులు ధన్నోజు నరేష్ చారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ, BJYM నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ధన్నోజు నరేష్ చారి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. యూత్ డిక్లరేషన్‌లో పేర్కొన్న హామీలను తక్షణమే అమలు చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు.
నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాల హామీ, రాజీవ్ యువ వికాసం, విద్యార్థినులకు స్కూటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రూ.10 లక్షల వడ్డీలేని రుణాల పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.

విద్యార్థులు, నిరుద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయలేదని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని నరేష్ చారి డిమాండ్ చేశారు. హామీల అమలుపై ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు ప్రమోద్ కుమార్, సీనియర్ నాయకులు బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, పోల్దాస్ రాము, BJYM నాయకులు పద్మ అనిల్ ముదిరాజ్, రాకేష్ వర్మ, అశోక్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.: యూత్ డిక్లరేషన్ హామీలు వెంటనే అమలు చేయాలి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *