ఈ సందర్భంగా జిల్లా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో వార్తల సేకరణ కోసం నిత్యం వివిధ ప్రాంతాలకు ప్రయాణించాల్సి వస్తున్నందున జర్నలిస్టులకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించడం అవసరమని వివరించారు.
ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జరిగే సంఘటనలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి, జర్నలిస్టుల అభ్యర్థనను పరిశీలించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు జిల్లా కమిటీ ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల సంఘం నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు, పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.: నాగర్‌కర్నూల్ జిల్లా జర్నలిస్టులకు ఉచిత బస్సు పాస్ కల్పించాలి…

Great content! Keep up the good work!
Tqq