తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికలు, రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విజయంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.

“మళ్లీ చెబుతున్నా… జరగబోయే కురుక్షేత్రంలో గెలిచేది మేమే” అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ, “కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతాం” అని తీవ్ర విమర్శలు చేశారు.

అదే సమయంలో ఎన్నికల షెడ్యూల్‌పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. “2028 డిసెంబర్‌లో ఎన్నికలు జరగవు. 2029 జూన్‌లోనే ఎన్నికలు జరుగుతాయి” అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అనంతరం తెలంగాణలో లోక్‌సభ స్థానాలు 17 నుంచి 25కు, అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.

ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పెంపు తర్వాతే ఎన్నికలు జరిగే అవకాశముందని సీఎం వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ వాదోపవాదాలకు ఇవి మరింత ఊతమిచ్చే అవకాశం కనిపిస్తోంది.: ‘జరగబోయే కురుక్షేత్రంలో గెలిచేది మేమే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *