ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులు, ఓపీ విభాగం, మందుల నిల్వలను పరిశీలించిన ఎమ్మెల్యే పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. వైద్య సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించి, విధుల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ఆసుపత్రికి వచ్చిన రోగులతో ఎమ్మెల్యే నేరుగా మాట్లాడి వైద్య సేవల నాణ్యత, మందుల లభ్యత, వైద్య సిబ్బంది స్పందనపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
అవసరమైన అన్ని మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిలో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని వైద్యాధికారులకు సూచించారు. సేవల్లో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి స్పష్టం చేశారు.: బొప్పల్లి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే…


