సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శంకర్ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని హెచ్చరించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు యువకులు మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే జిల్లా పోలీసు శాఖ లక్ష్యమని తెలిపారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా 1908కు తెలియజేయాలని, సమాచారదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు.
షీ టీమ్ ఇన్‌చార్జ్ విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళలు, బాలికల భద్రత కోసం తెలంగాణ పోలీసు శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీమ్ సేవలను వివరించారు. ఈవ్ టీజింగ్, స్టాకింగ్, సైబర్ వేధింపులు, మహిళలపై జరిగే నేరాల నివారణలో షీ టీమ్ కీలకంగా పనిచేస్తోందని తెలిపారు. బాధితులు భయపడకుండా ఫిర్యాదు చేయాలని, అవసరమైన వారికి కౌన్సెలింగ్‌తో పాటు చట్టపరమైన సహాయం అందిస్తామని చెప్పారు.
విద్యార్థులు చదువుపై దృష్టి సారించి విలువలతో కూడిన జీవితం గడపాలని, మద్యం, మాదకద్రవ్యాలు, సామాజిక మాధ్యమాల వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ, అపరిచితులు పంపే QR కోడ్‌లు స్కాన్ చేయకూడదని, OTP, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.
బాల్య వివాహాల దుష్పరిణామాలను వివరిస్తూ, అలాంటి ఘటనలు తెలిసిన వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే మైనర్లు, లైసెన్స్ లేనివారు, మద్యం సేవించి ఎవరూ వాహనాలు నడపకూడదని, రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.
మహిళలు, పిల్లలు, యువత అక్రమ రవాణాకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు లేదా షీ టీమ్‌కు సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం సభ్యులు ఆటపాటల ద్వారా సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శంకర్, కల్వకుర్తి ఇన్‌స్పెక్టర్ భీమ్ కుమార్, శుభ ఇన్‌స్పెక్టర్ కురుమూర్తి, షీ టీమ్ ఇన్‌చార్జ్ విజయలక్ష్మి సాయి, ఏహెచ్‌టీయూ అధికారులు, పోలీసు సిబ్బంది, సీబీఎం కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు: కల్వకుర్తిలో షీ టీమ్ అవగాహన కార్యక్రమం




