రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. పోక్సో కేసులో అరెస్టై ఇటీవల బెయిల్‌పై విడుదలైన ఓ నిందితుడు, తనపై కేసు నమోదు చేసిన కుటుంబంపై ప్రతీకారంతో ఆరుగురిని హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసుల వివరాల ప్రకారం, రాజ్ కుమార్ (28) అనే వ్యక్తిపై మే 16న ఓ బాలికపై లైంగిక దాడి చేసినట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మే 26న రాజ్ కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు.

బెయిల్‌పై వచ్చిన తర్వాత తనపై పోక్సో కేసు నమోదు చేశారనే కక్షతో రాజ్ కుమార్ అత్యంత ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు పెట్టిన బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు తన భార్య సరిత, ఇద్దరు చిన్నారులను హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది.

అంతేకాకుండా, బాధిత బాలికను పొలంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటన గురించి రాజ్ కుమార్ తల్లిదండ్రులే పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి వివరాలు అధికారిక దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.: పోక్సో కేసులో బెయిల్‌పై విడుదలైన నిందితుడి దారుణం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *