నాగర్ కర్నూల్: మన్ననూర్ పీటీజీ చెంచు గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో ఇటీవల చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనపై అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనను మధ్యలోనే నిలిపివేసి నేరుగా పాఠశాలకు చేరుకున్న ఆయన పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను స్వయంగా పరీక్షించిన ఎమ్మెల్యే, హాస్టల్‌లోని వంటగది, ఆహార నిల్వలు, ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను పరిశీలించారు. అపరిశుభ్రమైన నీటి సరఫరాపై ప్రిన్సిపల్‌ను మందలిస్తూ వెంటనే శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు.

అనంతరం ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే, వారం రోజుల్లో పనితీరులో మార్పు కనిపించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫుడ్ పాయిజన్ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

విద్యార్థులతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే హాస్టల్‌లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన ఆహార పదార్థాలనే వినియోగించాలని, నాసిరకం సరుకులు సరఫరా చేస్తే కాంట్రాక్టర్ సరుకులను వెంటనే తిరస్కరించాలని వార్డెన్‌కు సూచించారు. అలాగే రాత్రి వేళల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని, ఆర్డీఓ పర్యవేక్షణలో మెడికల్ క్యాంప్ నిర్వహించాలని ఆదేశించారు.

విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేసిన ఎమ్మెల్యే, పరిశుభ్రత, ఆహార నాణ్యత, విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.: మన్ననూర్ చెంచు గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ ఆకస్మిక తనిఖీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *