ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలంటూ..
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో BJYM ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో BJYM ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై నాగర్‌కర్నూల్ పార్లమెంట్ కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ తైలీ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడుల కోసం చేపట్టిన పర్యటనను అడ్డుకోవడం సరికాదని అన్నారు.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీరుగార్చుతోందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం అని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2029 జూన్‌లోనే ఎన్నికలు జరుగుతాయని, తెలంగాణలో పార్లమెంట్ స్థానాలు 25కు, అసెంబ్లీ స్థానాలు 182కు పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
47 ఏళ్ల తర్వాత నాగర్‌కర్నూల్‌కు రూ.20 కోట్లతో అత్యాధునిక బస్టాండ్ నిర్మాణానికి జూలై 8న రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలో ప్రజారవాణా అభివృద్ధికి ఇది మరో కీలక మైలురాయిగా నిలవనుంది.
నాగర్‌కర్నూల్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
విద్యార్థులకు అందాల్సిన వస్తువుల కొనుగోలు టెండర్లలో రూ.2,000 కోట్ల గోల్‌మాల్ జరిగిందని ఆరోపించిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత ఉంటే…
నాగర్ కర్నూల్‌లో తెలంగాణ జన సమితి పార్టీ నాల్గవ ప్లీనరీకి సంబంధించిన గోడపత్రికలను జిల్లా అధ్యక్షుడు మొసలి శ్యాంప్రసాద్ విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి టీజేఎస్ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
గద్వాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు అధికారులతో సమావేశం నిర్వహించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా లోక్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.