Category: latestnews

47 ఏళ్ల తర్వాత నాగర్‌కర్నూల్‌కు నూతన బస్టాండ్..

47 ఏళ్ల తర్వాత నాగర్‌కర్నూల్‌కు రూ.20 కోట్లతో అత్యాధునిక బస్టాండ్ నిర్మాణానికి జూలై 8న రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలో ప్రజారవాణా అభివృద్ధికి ఇది మరో కీలక మైలురాయిగా నిలవనుంది.

జూన్ 28న ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమం.

జూన్ 28న నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎన్. భరత్ కుమార్ రెడ్డి తెలిపారు. 0-5 సంవత్సరాల పిల్లలందరికీ తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.

రూ.2,000 కోట్ల టెండర్ గోల్‌మాల్ ఆరోపణలు.. బహిరంగ చర్చకు సిద్ధమన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

విద్యార్థులకు అందాల్సిన వస్తువుల కొనుగోలు టెండర్లలో రూ.2,000 కోట్ల గోల్‌మాల్ జరిగిందని ఆరోపించిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత ఉంటే…

ప్రజా పాలనలో పర్యావరణ చైతన్యం – నాగర్ కర్నూల్‌లో జనపనార సంచుల పంపిణీ

99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాలిక కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూలు నగర కిరాణా వర్తక సంఘం సహకారంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. మంజూరైన ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేసి, లబ్ధిదారుల ఎంపిక నుంచి గృహ ప్రవేశం వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

బావాజీపల్లిలో ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్

తిమ్మాజీపేట మండలం బావాజీపల్లి గ్రామంలో ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద చేపడుతున్న చెరువు పూడికతీత పనులను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల్లో నాణ్యత, పారదర్శకత పాటించాలని అధికారులకు ఆదేశించారు.

నాగర్ కర్నూల్‌లో ‘డ్రగ్స్ రహిత తెలంగాణ’పై అవగాహన సదస్సు

నాగర్ కర్నూల్ సాయి గార్డెన్‌లో జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు సమక్షంలో ‘డ్రగ్స్ రహిత తెలంగాణ మన అందరి ధ్యేయం’ కార్యక్రమం నిర్వహించారు. యువత, తల్లిదండ్రులు డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

నాగర్ కర్నూలు జిల్లా డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కె. కృష్ణ

మహబూబ్‌నగర్ జిల్లా నుంచి బదిలీపై వచ్చిన డాక్టర్ కె. కృష్ణ నాగర్ కర్నూలు జిల్లా డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.