బుధవారం నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలోని పీపీ యూనిట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, వైద్యులు మరియు సిబ్బందితో కార్యక్రమం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.
ఇటీవల సాధారణ టీకాల కార్యక్రమంలో పోలియో చుక్కలు వేసినా కూడా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో మరోసారి చుక్కలు వేయించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి అర్హులైన చిన్నారులను పోలియో కేంద్రాలకు తీసుకువచ్చేలా తల్లిదండ్రులను చైతన్యపరచాలని సూచించారు. కార్యక్రమంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆరోగ్య సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదేవిధంగా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో పుట్టిన ప్రతి నవజాత శిశువుకు సోమవారం నుంచి శనివారం వరకు గది నెంబర్-22లో బీసీజీ టీకా తప్పనిసరిగా వేయాలని సూచించారు. గర్భిణీలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు హెల్ప్ డెస్క్ సమర్థవంతంగా పనిచేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ పి.సృజన, హెల్త్ ఎడ్యుకేటర్ ఓరుగంటి శ్రీనివాసులు, నర్సింగ్ అధికారి వనిత, ఆరోగ్య పర్యవేక్షకులు మరియమ్మ, హెల్ప్ డెస్క్ ఇన్‌చార్జ్ యాదగిరి, పద్మ, సోషల్ వర్కర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.: జూన్ 28న ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమం.




