కలశాభిషేకం.
జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో 11వ వార్షికోత్సవ పూజలను నిర్వహించారు. ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు బిల్ల కంటి హరిబాబు వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయ కమిటీ అధ్యక్షుడు మిడిదొడ్డి అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలకు పట్టణంలోని ఆర్య వైశ్యులు విశేషంగా పాల్గొన్నారు. ఆలయంలో ప్రధాన మూలమూర్తికి మహాభిషేకం ధ్వజరోహణం గోపూజ గణపతి పూజ నిర్వహించిన అనంతరం నవగ్రహ క్షేత్రపాలక వాస్తు మండప దేవతలను ఆహ్వానించారు అనంతరం ఉత్సవ మూర్తికి పవిత్ర జలాలతో కలశాభిషేకం విశేష పూజలు నిర్వహించారు. సుబ్రహ్మణ్యం మూలమంత్ర హోమం తో పాటు నవగ్రహ పూజలు కుంకుమార్చన అనంతరం మహానీరాజనం సమర్పించారు అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్యులు మరియు దేవాలయ కమిటీ తదితరులు పాల్గొన్నారు: ఘనంగా 11వ వార్షికోత్సవ వేడుకలు…


