జిల్లా శిశు సంక్షేమ, మహిళా సాధికార శాఖ ఆధ్వర్యంలో “అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం” ను పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాల (ఆర్ట్స్ & కామర్స్) లో విద్యార్థులకు వ్యాసరచన, నినాదాల రచన పోటీలు నిర్వహించారు.*”మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే నష్టాలు, మరియు ఈ దుర్వ్యసనం సమాజంపై చూపే ప్రభావం – మాదక ద్రవ్యాలు వినియోగించే వారిని నేరస్థులుగా భావించాలా? లేక బాధితులుగా సహాయం అందించాలా?” అనే అంశంపై తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు *జిల్లా కలెక్టరేట్‌లో బహుమతి ప్రదానోత్సవం* ఘనంగా నిర్వహించారు. జిల్లా శిశు సంక్షేమ, మహిళా సాధికార శాఖ అధికారులు విజేతలకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల బారిన పడిన వారిని నేరస్థులుగా కాకుండా బాధితులుగా చూసి, వారికి కౌన్సెలింగ్, పునరావాస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు.
*పోటీలలో విజేతలు:*
*తెలుగు మీడియం – వ్యాసరచన:*
1. వి. కృష్ణవేణి – బి.ఏ III సంవత్సరం
2. ఎ. భవాని – బి.ఏ II సంవత్సరం
3. ఎం. గాయత్రి – బి.ఏ III సంవత్సరం
*ఇంగ్లీష్ మీడియం – వ్యాసరచన:*
1. కె. కీర్తన – బి.కామ్ III సంవత్సరం
2. ఆర్. మనీషా – బి.ఏ II సంవత్సరం
3. పి. లావణ్య – బి.కామ్ II సంవత్సరం
*ఉర్దూ మీడియం – వ్యాసరచన:*
1. సమీనా నజీమ్ – బి.ఏ III సంవత్సరం
2. ముఫీదా హుస్నా – బి.ఏ III సంవత్సరం
3. ఫాతిమా బేగం – బి.ఏ II సంవత్సరం
*నినాదాల రచన:*
1. ఎం. గాయత్రి – బి.ఏ III తెలుగు మీడియం
2. అర్షియా – బి.ఏ III ఇంగ్లీష్ మీడియం
3. సమీనా నజీమ్ – బి.ఏ III ఉర్దూ మీడియం
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, జిల్లా శిశు సంక్షేమ, మహిళా సాధికార శాఖ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.: నాగర్‌కర్నూల్‌లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం
