Tag: nagarkurnool

కొల్లాపూర్ వాసవి దేవాలయంలో వైభవంగా లలిత త్రిపుర సుందరి అలంకరణ

కొల్లాపూర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు లలిత త్రిపుర సుందరి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. లలితా సహస్రనామాన్ని చేతితో కుట్టిన పట్టు చీరను దంపతులు అమ్మవారికి సమర్పించారు.

శ్రీపురం అంగన్‌వాడీ కేంద్రంలో ‘తొలిముద్దు’ కార్యక్రమం ప్రారంభం

నాగర్‌కర్నూల్ మండలం శ్రీపురం గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో ‘తొలిముద్దు’ అల్పాహార పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మూడు నుంచి ఆరు సంవత్సరాల చిన్నారులకు కిచిడి, ఉప్మా వంటి అల్పాహారాన్ని అందించనున్నారు.

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైద్యులు, నర్సింగ్ అధికారులు, ఆరోగ్య సిబ్బంది గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

డిపిఆర్ఓ తీరు మారకపోతే ఖబర్దార్..!

నాగర్‌కర్నూల్ డిపిఆర్ఓ కార్యాలయంపై టీయూడబ్ల్యూజే (ఐజేయు) నాయకులు ఆరోపణలు చేశారు. అర్హత కలిగిన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అందించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.

సరస్వతి శిశుమందిర్‌ సంస్కార నిలయాలు..

నాగర్‌కర్నూల్‌లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో పూర్వ పాలమూరు జిల్లాలోని 28 పాఠశాలల నుంచి వచ్చిన 250 మంది ఉపాధ్యాయులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. విద్యతో పాటు సంస్కారం, దేశభక్తి, నైతిక విలువలను విద్యార్థుల్లో పెంపొందించాలని వక్తలు…

ఉపాధ్యాయులే భావితరాలకు దిశానిర్దేశకులు…

భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. నాగర్‌కర్నూల్‌లో 70 మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు.

వానాకాలం వరి కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

వానాకాలం వరి కొనుగోళ్లను రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు ముందస్తుగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు సిద్ధంగా ఉంచాలని సూచించారు.

వెంకటాపురంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

నాగర్‌కర్నూల్ మండలం వెంకటాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు, గ్రామపంచాయతీ, వీవో భవనాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ పరిశీలించారు. పనులను వేగవంతం చేసి నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

కంటి దానం మరో ఇద్దరికి చూపు ప్రసాదం..

41వ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా నాగర్‌కర్నూల్ పాత కలెక్టరేట్‌లో నిర్వహించిన కంటి శిబిరంలో 51 మందికి పరీక్షలు నిర్వహించగా, 21 మందికి కేటరాక్ట్ సమస్య గుర్తించారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక..

నాగర్‌కర్నూల్‌లో జరిగిన రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య ఉద్యోగుల జిల్లా సమావేశంలో 2026–28 నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా వేముల కుర్మయ్య ఎన్నికయ్యారు.