నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో డిప్యూటీ నర్సింగ్ సూపర్డెంట్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన కె. మంజుల రాణికి ఘన సత్కారం నిర్వహించారు. శుక్రవారం ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఆత్మీయ పదవీ విరమణ సభలో ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ పి. సుప్రియ ఆమెను శాలువాతో సత్కరించి అభినందించారు.

ఆరోగ్యశాఖలో సుమారు 36 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో విధులు నిర్వహించిన మంజుల రాణి సేవలను ఈ సందర్భంగా పలువురు వైద్యులు, నర్సింగ్ అధికారులు, సిబ్బంది గుర్తుచేసుకున్నారు. నాగర్ కర్నూల్ సివిల్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్‌గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి, అదే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో డిప్యూటీ నర్సింగ్ సూపర్డెంట్‌గా పదవీ విరమణ చేయడం సంతోషకరమైన విషయమని పలువురు పేర్కొన్నారు.

గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆమెకు లభించిన పలు అవార్డులు, సేవలను అధికారులు, వైద్యులు ప్రశంసించారు. అక్షరాస్యత, సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాల నిర్మూలన, ఆరోగ్య సేవలపై శాస్త్రీయ అవగాహన కల్పించడంలో ఆమె చేసిన కృషిని గుర్తుచేశారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఆమె అందించిన ఆరోగ్య సేవలను పలువురు అభినందించారు.

ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు జనార్ధన్, వివిధ విభాగాల ప్రొఫెసర్లు డాక్టర్ ఉమాకాంత్, డాక్టర్ శ్రీకాంత్, ఆర్ఎంఓ డాక్టర్ అజీమ్, నర్సింగ్ సూపర్డెంట్ సంగీత, డిప్యూటీ నర్సింగ్ సూపర్డెంట్లు పేర్సీ సుమన్, సలేహా, నాగవేణి, ఉప సంచాలకులు సీజే వసంత్ కుమార్, నర్సింగ్ అధికారులు, బంధుమిత్రులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.: ప్రభుత్వ ఆసుపత్రిలో మంజుల రాణికి ఘన సత్కారం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *