ఆగస్టు 9న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన టైక్వాండో పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి డాక్టర్ తెప్ప శ్రీనివాస్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. 55 సంవత్సరాల వయస్సులో ఈ ఘనత సాధించడం అభినందనీయమని మంత్రి వాకిటి శ్రీహరి ప్రశంసించారు.
గత 35 సంవత్సరాలుగా మార్షల్ ఆర్ట్స్‌లో సాధన చేస్తూ, నాగర్‌కర్నూల్ జిల్లా టైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడిగా యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తున్న శ్రీనివాస్ సేవలను మంత్రి కొనియాడారు. అలాగే గత 16 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్, సేవా ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు.
క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. యువత ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని, క్రీడలు, మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రతిరోజూ కనీసం గంటసేపు వ్యాయామం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు వాకిటి ఆంజనేయులు, జిల్లా డైరెక్టర్ తెప్ప బాబు, నాగనూలు సొసైటీ అధ్యక్షుడు తిరుపతయ్య, ఇతర నాయకులు, టైక్వాండో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మాస్టర్ రవి, ట్రెజరర్ మాస్టర్ స్వాతి, విద్యార్థులు పాల్గొని డాక్టర్ తెప్ప శ్రీనివాస్‌ను అభినందించారు.: గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన డాక్టర్ తెప్ప శ్రీనివాస్‌కు మంత్రి వాకిటి శ్రీహరి ఘన సన్మానం


