ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలంటూ..
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో BJYM ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో BJYM ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
నాగర్‌కర్నూల్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తల్లోజు ఆచారి డిమాండ్ చేశారు.
కల్వకుర్తి మండలం బెక్కేర గ్రామంలో పైలెట్ ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న రీ-సర్వే పనులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. చెన్నయ్య పరిశీలించారు. రీ-సర్వేపై ప్రజల అపోహలను తొలగించి, భూ యజమానులకు పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
కల్వకుర్తిలో BJYM ఆధ్వర్యంలో నిర్వహించిన "ఫీజుల బకాయి – BJP లడాయి" కార్యక్రమంలో విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కల్వకుర్తిలో మహాలక్ష్మీ వైన్స్ షాప్‌లో జరిగిన చోరీ కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. రూ.1.75 లక్షల నగదు, డీవీఆర్ స్వాధీనం చేసుకుని నిందితుడు చిమ్ముల మల్లికార్జున్ రెడ్డి అలియాస్ చిన్నను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
తిరుమలలో జర్నలిస్టు బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలు ఢిల్లీ సీఎం రేఖ గుప్త సమక్షంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.
నాగర్ కర్నూల్ జిల్లాలో నిధుల దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ బాదావత్ సంతోష్ సస్పెండ్ చేశారు.
తర్మికల్ గ్రామంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ప్రారంభించి, జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ పిలుపునిచ్చారు.
కల్వకుర్తి డివిజన్‌లో ఆస్తి వివాదం నేపథ్యంలో యువకుడిని పథకం ప్రకారం హత్య చేసిన కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ పార్టీ ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది.