ఈ సందర్భంగా బచ్చు రామకృష్ణ, ముఖ్యమంత్రిని శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొన్న పలువురు నాయకులు రామకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు యన్నం భూపతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్, టోల్ గేట్ నిర్వాహకులు శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. అలాగే నాయకులు ఉప్పు ఆంజనేయులు, మిరియాల రాజయ్య తదితరులు హాజరై వేడుకలను మరింత విశిష్టంగా తీర్చిదిద్దారు.
స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పలువురు రామకృష్ణకు భవిష్యత్తులో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.: తిరుమలలో జర్నలిస్టు బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలు




