నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి చేతుల మీదుగా మొత్తం 229 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

నాగర్ కర్నూల్ పట్టణం, మండలం, బిజినపల్లి, తాడూర్, తిమ్మాజిపేట, తెల్కపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతోందని ఆయన అన్నారు. పథకాల గురించి ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అర్హులైన వారు తప్పక దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందాలని సూచించారు.

ఎలాంటి సమస్యలు ఎదురైనా ప్రజలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్, NSUI శ్రేణులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.: నాగర్ కర్నూల్‌లో 229 CMRF చెక్కుల పంపిణీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *