నాగర్ కర్నూల్ జిల్లాలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం మరియు నిధుల దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటూ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు మరియు ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్ మార్గదర్శకాలను పాటించకుండా వ్యవహరించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామపంచాయతీకి చెందిన గ్రేడ్-IV పంచాయతీ కార్యదర్శి పి. కిషన్, కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామపంచాయతీకి చెందిన గ్రేడ్-III పంచాయతీ కార్యదర్శి పి. అర్జునయ్య, అలాగే అంకిరావుపల్లి గ్రామపంచాయతీకి చెందిన గ్రేడ్-III పంచాయతీ కార్యదర్శి ఆర్. ప్రేమచంద్‌లను విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఈ అధికారులు నిధుల వినియోగంలో మార్గదర్శకాలను పాటించకపోవడంతో పాటు విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు గుర్తించబడింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వ నిధుల వినియోగంపై అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
అదేవిధంగా వంగూరు, కొల్లాపూర్ మండలాల పంచాయతీ అధికారుల పర్యవేక్షణలో లోపాలు ఉన్నందున వారికి షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
ప్రభుత్వ నిధుల వినియోగంలో పారదర్శకత మరియు బాధ్యతాయుత విధానాలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా అధికారులకు సూచించారు.: ముగ్గురు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *