ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై డీసీసీ కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. పార్టీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేయాలని, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, సీడబ్ల్యూసీ సభ్యులు చల్లా వంశీ చందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇంకా మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పార్టీ ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు నాయకులు వెల్లడించారు.: నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా











