నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని మహాలక్ష్మీ వైన్స్ షాప్‌లో జరిగిన చోరీ కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో రూ.1.75 లక్షల నగదు, డీవీఆర్‌తో పాటు నేరానికి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు చిమ్ముల మల్లికార్జున్ రెడ్డి అలియాస్ చిన్న (32) షాప్ వెనుక గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించాడు. అనంతరం సీసీ కెమెరాల వైర్లను కత్తిరించి, కౌంటర్‌లో ఉన్న రూ.1.75 లక్షల నగదుతో పాటు డీవీఆర్‌ను తీసుకుని పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసిన కల్వకుర్తి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.

వాహనాల తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి నగదు, డీవీఆర్‌తో పాటు నేరానికి ఉపయోగించిన సుత్తి, కట్టింగ్ ప్లేయర్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన కల్వకుర్తి సీఐ బీమ్ కుమార్, ఎస్‌ఐ కురుమూర్తి, కానిస్టేబుళ్లు చిరంజీవి, నజీరోద్దీన్‌లను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ (IPS), డీఎస్పీ ఎస్. వెంకట్ రెడ్డి అభినందించి వారి పనితీరును ప్రశంసించారు.: కల్వకుర్తిలో మహాలక్ష్మీ వైన్స్ షాప్ చోరీ కేసు ఛేదన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *