Tag: Crime News Telangana

కల్వకుర్తిలో మహాలక్ష్మీ వైన్స్ షాప్ చోరీ కేసు ఛేదన.

కల్వకుర్తిలో మహాలక్ష్మీ వైన్స్ షాప్‌లో జరిగిన చోరీ కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. రూ.1.75 లక్షల నగదు, డీవీఆర్ స్వాధీనం చేసుకుని నిందితుడు చిమ్ముల మల్లికార్జున్ రెడ్డి అలియాస్ చిన్నను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మహారాష్ట్ర సరిహద్దులో పూడ్చిపెట్టిన భార్య..

మియాపూర్‌లో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మహారాష్ట్ర సరిహద్దులో మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్‌తో కేసును ఛేదించారు.

పాప మృతి పై దర్యాప్తు కొనసాగుతోంది, ఎస్పీ స్పష్టం

కుమ్మెర మల్లన్న జాతర సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు, రెండు నెలల పాప మృతి ఘటనను అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా,…