నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తా వద్ద ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ ఆకారపు విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్య తెలిపారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఉదయం గోపూజ అనంతరం 9 గంటలకు గణపతి హోమం, లక్ష్మీ దుర్గ అమ్మవారి హోమాలను భక్తుల భాగస్వామ్యంతో నిర్వహించనున్నారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి ప్రతిరోజూ పంచామృత అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు పి. నవీన్ కుమార్ శర్మ తెలిపారు. ఉదయం, సాయంత్రం మహిళా భక్తులచే సామూహిక లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ప్రదోష సమయంలో అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించనున్నారు.

నవరాత్రుల్లో ప్రతిరోజూ అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించనున్నారు. బాలా త్రిపుర సుందరి, గాయత్రీ దేవి, అన్నపూర్ణాదేవి, లలితా త్రిపుర సుందరి, సరస్వతి దేవి, దుర్గాదేవి, మహాలక్ష్మి, మహిషాసుర మర్దిని, రాజరాజేశ్వరి దేవి రూపాల్లో అమ్మవారి అలంకరణలు ఉంటాయి.

భక్తుల కోసం చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలతో పాటు అన్నప్రసాద పంపిణీని కూడా ఏర్పాటు చేశారు. మహిళా భక్తులు అమ్మవారికి వడి బియ్యం సమర్పించవచ్చని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

పూజలు, అభిషేకాలు, హోమాలు, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, కుంకుమార్చన తదితర కార్యక్రమాల కోసం 9441303182, 9494267558 నంబర్లలో సంప్రదించాలని కోరారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.: నాగర్‌కర్నూల్‌లో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *