నాగర్‌కర్నూల్, అక్టోబర్ 9: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఉమెన్ ఎంపవర్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కళాశాల విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ మదన్‌మోహన్ కార్యక్రమ వివరాలను వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి సఖి కోఆర్డినేటర్ సునీత, పట్టణ 4వ వార్డు కౌన్సిలర్ వసంత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణలో కార్యక్రమానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, గౌరమ్మలను ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

అనంతరం విద్యార్థినులు బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలతో సందడి చేశారు. కళాశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను ఈ సందర్భంగా పలువురు వివరించారు.

విద్యార్థినుల్లో సాంస్కృతిక చైతన్యం, ఐక్యత, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించే ఉద్దేశంతో బతుకమ్మ వేడుకలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం బతుకమ్మ పోటీలను నిర్వహించి ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు.

కార్యక్రమం ముగిసిన అనంతరం విద్యార్థినులు, కళాశాల సిబ్బంది కలిసి బతుకమ్మలను ట్యాంక్‌బండ్‌కు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో అధ్యాపకులు అంజయ్య, వనిత, ఉమాదేవి, కోదండరాములు, రామకృష్ణ, దశరథం, శోభారాణి, పూజ, ముజఫర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.: ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *