ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ ఇన్‌చార్జి సీడీపీఓ శోభారాణి మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యను అభ్యసిస్తున్న మూడు నుంచి ఆరు సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు ప్రతిరోజూ ఉదయం అల్పాహారం అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు.
‘తొలిముద్దు’ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు కిచిడి, ఉప్మా వంటి అల్పాహారాన్ని అందించనున్నట్లు చెప్పారు. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, శారీరక ఎదుగుదలకు సమతుల్యమైన ఆహారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు విద్యతో పాటు పోషకాహారం అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందేలా అంగన్‌వాడీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాలయ సూపరింటెండెంట్ విద్యా ప్రకాష్, అంగన్‌వాడీ పర్యవేక్షకులు పద్మ, బాలమణి, కృష్ణవేణి, గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు గీతా, ప్రభావతి, బాలింతలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.: శ్రీపురం అంగన్‌వాడీ కేంద్రంలో ‘తొలిముద్దు’ కార్యక్రమం ప్రారంభం




