ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం అంజయ్య 38 సంవత్సరాల పాటు నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన వృత్తి జీవితంలో సాధించిన విజయాలు, సంపాదించిన గౌరవం, ప్రజల నుంచి పొందిన అభిమానమే ఆయన సేవలకు నిదర్శనమని కొనియాడారు.
పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి ముగింపు మాత్రమేనని, జీవితానికి కాదని ఎస్పీ పేర్కొన్నారు. ఇకపై అంజయ్య తన కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖలో ఆయన అందించిన సేవలను సిబ్బంది ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తెలిపారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన పోలీస్ వెల్ఫేర్ సంఘం సభ్యులు, పోలీస్ అభ్యర్థులు రిటైర్డ్ ఎస్సై అంజయ్యను ఘనంగా సన్మానించారు. ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు, నాగర్ కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అశోక్ రెడ్డి, ఏఓ కృష్ణయ్య, జిల్లా పోలీస్ వెల్ఫేర్ సంఘం నూతన అధ్యక్షుడు హెడ్ కానిస్టేబుల్ చిన్ను నాయక్, నూతనంగా ఎన్నికైన సంఘం సభ్యులు, పోలీస్ సిబ్బంది, అంజయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.: 38 ఏళ్ల పోలీస్ సేవలకు వీడ్కోలు..



