ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే, తెల్కపల్లి మండలంలో SIR డిజిటలైజేషన్ ప్రక్రియ ఇప్పటికే 86 శాతం పూర్తయిందని తెలిపారు. మిగిలిన ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని BLAలకు సూచించారు. బూత్ లెవల్ అధికారులతో (BLOలు) సమన్వయం చేసుకుంటూ డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా కొత్త ఓటర్ల నమోదు, ఓటరు వివరాల్లో మార్పులు, చేర్పులు, తొలగింపులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆగస్టు 3 తర్వాత విడుదలయ్యే డ్రాఫ్ట్ ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, మ్యాపింగ్ కాని ఓట్లు, కొత్త ఓటర్ల నోటీసులు, అలాగే మరణించిన లేదా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలని తెలిపారు.
ఈ సమావేశంలో తెల్కపల్లి మండలానికి చెందిన 54 మంది BLAలు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని SIR ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన అంశాలపై చర్చించారు.: తెల్కపల్లిలో SIR ప్రక్రియపై మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సమీక్ష..



