నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో భారతీయ జనతా యువమోర్చా (BJYM) ఆధ్వర్యంలో “ఫీజుల బకాయి – BJP లడాయి” కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ధన్నోజు నరేష్ చారి నేతృత్వంలో గవర్నమెంట్ మోడ్రన్ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, కృష్ణవేణి జూనియర్ కాలేజ్, సావిత్రిబాయి ఫూలే వొకేషనల్ కాలేజ్, న్యూ ఏరా కాలేజ్ తదితర విద్యాసంస్థల్లో విద్యార్థులతో సంతకాల సేకరణ చేపట్టారు.

ఈ సందర్భంగా ధన్నోజు నరేష్ చారి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. విద్యార్థులకు రావాల్సిన బకాయిల వివరాలను వారితోనే రాయించి సంతకాలు సేకరించినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు వంటి హామీలు ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు.

గత ఐదేళ్లుగా ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి ₹5,000 చొప్పున ఇవ్వాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించలేదని, దీంతో ఒక్కో విద్యార్థికి సుమారు ₹25,000 బకాయి ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు ₹15,000 కోట్ల వరకు ఉన్నాయని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిల కారణంగా విద్యార్థులు పరీక్షలు రాయడం, సర్టిఫికెట్లు పొందడం, ఉన్నత విద్య కొనసాగించడం వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేసి, ప్రతి విద్యా సంవత్సరంలో సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించే విధంగా స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని BJYM నాయకులు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.: కల్వకుర్తిలో BJYM ఫీజుల బకాయి–BJP లడాయి ఉద్యమం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *