జర్నలిస్టుల హక్కుల కోసం ప్రతి ఐజేయూ కార్యకర్త అలుపెరగని పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తమ సంఘం ఏ రాజకీయ పార్టీకి అనుకూలం గానీ, ప్రతికూలం గానీ కాదని, కేవలం జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధన మాత్రమే లక్ష్యమని స్పష్టం చేశారు. జిల్లాలో యూనియన్ బలోపేతం కావడంతో కొందరు చీలికలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని, అలాంటి కుట్రలను సభ్యులు అప్రమత్తంగా తిప్పికొట్టాలని సూచించారు.
త్వరలో జర్నలిస్టులకు ఇంటి స్థలాల కోసం ఉద్యమం చేపడతామని, అక్రిడేషన్ కమిటీల ఏర్పాటు, హెల్త్ కార్డుల జారీ, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు బస్సు పాస్‌ల ప్రాసెసింగ్ వేగవంతం అవుతోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించేందుకు సంఘం దశలవారీగా పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.
సమావేశంలో జిల్లా కార్యదర్శి ఆర్. సురేష్ కుమార్, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు కే. నాగరాజ్ గౌడ్, వనపర్తి జిల్లా అధ్యక్షుడు మాధవరావు సిందే, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు సుదర్శన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ముబిన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘటితంగా ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు.: జర్నలిస్టుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం కొనసాగిద్దాం: Read more: జర్నలిస్టుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం కొనసాగిద్దాం:


