అధికారులతో కలిసి ఓటరు జాబితాలపై నివేదికలను పరిశీలించడంతో పాటు, కొత్త బూత్‌ల ఏర్పాటు, బూత్ రేషనలైజేషన్‌కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేశారు. ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేలా, ప్రతి అర్హుడైన ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ప్రజలు తమ ఓటును దుర్వినియోగం కాకుండా కాపాడుకోవాలని, ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. అర్హులైన వారు తప్పకుండా ఓటరు నమోదుకు ముందుకు రావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల సంయోజకురాలు మాకం చంద్రకళ, మండల అధ్యక్షుడు నోమే మేశ్వర్ రెడ్డి, జిల్లా ఆఫీస్ సెక్రటరీ చందు, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, బీజేపీ నాయకులు బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఎన్నికల ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు.: నాగర్‌కర్నూల్‌లో SIR మండల ప్రవాస్ అభియాన్.


