హైపర్‌సైట్ టెక్నాలజీ వల్ల చికిత్సకు సంబంధించిన దుష్ప్రభావాలు 40 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని, ఆరోగ్యకరమైన కణజాలానికి రేడియేషన్ వల్ల కలిగే నష్టాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు. అలాగే బ్రీతింగ్ కంట్రోల్ టెక్నాలజీ సహాయంతో కణితిపై మరింత ఖచ్చితత్వంతో రేడియేషన్ అందించడం వల్ల చికిత్స సురక్షితంగా, తక్కువ సమయంలో పూర్తయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
డాక్టర్ స్రవంతి మాట్లాడుతూ, ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, స్థూలకాయం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పురుషుల్లో ధూమపానం కారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు అధికంగా ఉంటుందని, పొగతాగడం మానేయడం ద్వారా ఆ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు.
మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని, అందులో సుమారు 10 శాతం కేసులు జన్యుపరమైన కారణాల వల్ల వస్తాయని తెలిపారు. అయితే చాలా సందర్భాల్లో ముందస్తు స్క్రీనింగ్ ద్వారా వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి విజయవంతంగా చికిత్స చేయవచ్చని చెప్పారు.
40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలని డాక్టర్ స్రవంతి సూచించారు. సమయానికి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాణాంతక వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి విజయవంతంగా ఎదుర్కొనే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.: హైపర్‌సైట్‌తో క్యాన్సర్ చికిత్సలో విప్లవం యశోద హాస్పిటల్స్
