ఈ సందర్భంగా ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిటైర్ అయిన వెంటనే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. అలాగే ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్)ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా టీజీఈజేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా చైర్మన్ భావండ్ల వెంకటేష్ మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల సంక్షేమం, పదవీ విరమణ అనంతర భద్రత కోసం ఓపీఎస్ అమలుతో పాటు పెండింగ్ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో టీజీఈజేఏసీ అడిషనల్ సెక్రటరీ జనరల్ శ్రీధర్ శర్మ, కో-చైర్మన్ మధుసూదన్ రెడ్డి, కోశాధికారి షర్ఫుద్దీన్‌తో పాటు జేఏసీ సభ్యులు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, మహిళా నాయకులు, ఉద్యోగులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.: రిటైర్ అయిన వెంటనే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ మంజూరు చేయాలి…

