బల్మూర్‌లో రూ.146.71 కోట్ల రహదారి పనులకు శంకుస్థాపన..
బల్మూర్‌లో రూ.146.71 కోట్లతో చేపట్టనున్న మూడు కీలక రహదారి అభివృద్ధి పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు.
బల్మూర్‌లో రూ.146.71 కోట్లతో చేపట్టనున్న మూడు కీలక రహదారి అభివృద్ధి పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు.
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో షీ టీం, భరోసా ఆధ్వర్యంలో మహిళలు, బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమస్యలు ఎదురైతే భయపడకుండా షీ టీంను సంప్రదించాలని ASI విజయలక్ష్మి సూచించారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, అభ్యసన సామర్థ్యాలు, ఎఫ్‌ఎల్‌ఎన్ ఫలితాలు మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. అర్హులైన ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని శ్రీ అలర్మేల్ మంగ సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం రెండో శనివారం స్వామి అమ్మవార్ల కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా నిర్వహించారు. 36 మంది దంపతులు వ్రతాల్లో పాల్గొన్నారు.
బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో శని గ్రహదోష నివారణ కోసం భక్తులు తిలతైల అభిషేక పూజలు నిర్వహించారు. పరమశివునికి రుద్రాభిషేకాలు, నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేపట్టారు.
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఇప్పల తండాలో 43 ఏళ్ల మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భూమి కౌలు విషయంలో ఏర్పడిన విభేదాలే హత్యకు కారణమని తెలిపారు. మృతురాలి బంధువైన కరావత్ హీరమ్మను అరెస్ట్ చేసి, ఆమె వద్ద నుంచి…
కల్వకుర్తి మండలం బెక్కేర గ్రామంలో పైలెట్ ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న రీ-సర్వే పనులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. చెన్నయ్య పరిశీలించారు. రీ-సర్వేపై ప్రజల అపోహలను తొలగించి, భూ యజమానులకు పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి లభ్యతకు అనుగుణంగా రైతులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. వనపర్తిలో జరిగిన ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి పారుదల సలహా మండలి సమావేశంలో జూరాల, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి తదితర…
# హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడంలో అవగాహన అత్యంత కీలకమని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. జిల్లా స్థాయి ముమ్మర IEC ప్రచార కార్యక్రమం–2026లో భాగంగా నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు.
వార్షిక తనిఖీలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అచ్చంపేట సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్, సిద్ధాపూర్ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, ఫిర్యాదులపై వేగంగా స్పందించి బాధితులకు సత్వర న్యాయం…