కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్బిఐ నిబంధనల ప్రకారం అందించే రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకొని సమయానికి తిరిగి చెల్లించాలని సూచించారు. గ్రామీణ మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు, గ్రామాల అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన అన్నారు.
అదేవిధంగా గ్రామీణ కూట సంస్థ మహిళలకు రుణాలతో పాటు అవగాహన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోందని నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఆరుగురు మహిళలకు రుణాల చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏరియా మేనేజర్ వెంకటేష్, బ్రాంచ్ మేనేజర్ నరేష్, సపోర్టింగ్ మేనేజర్ మాణిక్యం, మున్సిపల్ చైర్మన్ సునీంద్ర కుమార్, వైస్ చైర్మన్ బాదం రమేష్, కౌన్సిలర్లు శ్రీనివాసులు, శంకర్, సింధు, చంద్రకళ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజ్ కుమార్ రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.: నాగర్ కర్నూల్‌లో గ్రామీణ కూట బ్యాంకు కార్యాలయం ప్రారంభం…



