నాగర్ కర్నూల్ జిల్లా నుండి Amarnath Temple యాత్రకు వెళ్లనున్న భక్తుల కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో యాత్రికులకు అవసరమైన ఆరోగ్య ధృవీకరణ పత్రాలను జారీ చేసినట్లు ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ టి. ఉషారాణి తెలిపారు.
యాత్రికుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా పరిశీలించిన డాక్టర్ ఉషారాణి కార్యక్రమాన్ని ప్రారంభించి, యాత్రలో పాటించాల్సిన పలు ఆరోగ్య సూచనలు చేశారు. ఎత్తైన ప్రాంతాల్లో ప్రయాణం చేయాల్సి ఉండటంతో శ్వాసకోశ సమస్యలు, రక్తపోటు, షుగర్ వంటి ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులకు సూచించారు.
అమర్నాథ్ యాత్రతో పాటు Kedarnath Temple మరియు Char Dham యాత్రలకు వెళ్లే భక్తులకు కూడా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య ధృవీకరణ పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనరల్ ఫిజీషియన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మోనాదేవి, డాక్టర్ నికిత, సహాయ సంచాలకులు సీజే వసంత్ కుమార్, ఆర్‌ఎంఓ డాక్టర్ ప్రశాంత్, నర్సింగ్ సూపర్డెంట్ మంజుల, పద్మ, హెల్ప్ డెస్క్ ఇంచార్జ్ టి. యాదగిరి, నర్సింగ్ అధికారులు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.: అమర్నాథ్ యాత్రికులకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *